దీదీ డిమాండ్ : మోదీ నామినేషన్‌ రద్దు చేయండి


టీఎంసీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ ప్రధాని నరేంద్రమోదీ సోమవారం సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప.బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జి ఆగ్రహం వ్యకం చేసింది. ప్రధాని వ్యాఖ్యలు ఎమ్మెల్యేల కొనుగోళ్ల కిందకు వస్తుందని, వెంటనే ఆయన నామినేషన్‌ను రద్దు చేయాలంటూ డిమాండ్ చేసింది. ఈ మేరకు టీఎంసీ మంగళవారం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

ఇక, వయనాడ్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్ పై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఈసీ క్లీన్ చీట్ ఇచ్చింది. మోడీ ప్రసంగంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవని భావిస్తున్నట్టు వెల్లడించింది. ప్రధానిపై టీఎంసీ చేసిన ఫిర్యాదుపై ఈసీ ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు, ప్రధాని ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకోకపోవడంతో అవి సుప్రీంను ఆశ్రస్తున్నారు.