తెలంగాణ కాంగ్రెస్’కి చిన్ని ఊరట
తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ అయ్యే దిశగా తెరాస ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలను విలీనం చేసుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేల విషయంలోనూ అదే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ముఖ్య నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై మంగళవారం విచారణ జరిపిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీ తెరాసలో విలీనం చేయడం చట్టవిరుద్ధమైతే ఆ విలీనాన్ని రద్దు చేస్తామని, ఆ అధికారం తమకుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు విచారించాల్సినంత అత్యవసరమేమీ ఇందులో లేదంటూ విచారణను జూన్ 11కి వాయిదా వేసింది.