వార్నర్ లేని హైదరాబాద్’ని చూడగలమా ?


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్ అనేగానే.. వార్నర్ ఉన్నాడా ? ఎంత బాదాడు ?? అని అడుగుతుంటారు. సన్‌రైజర్స్‌ అంటే వార్నర్. వార్నర్ అంటే సన్‌రైజర్స్‌ గా మారిపోయింది. ఎన్నో మ్యాచ్ లని వార్నర్ ఒంటిచేత్తో గెలిపించాడు. కెప్టెన్ గా సేవలందించాదు. ఐతే, ఐపీఎల్ సీజన్ 12 కీలక మ్యాచ్ లు మిగిలిఉండగానే జట్టుకు దూరమయ్యాడు. మంగళవారం వార్నర్ స్వదేశానికి పయనమయ్యాడు.

ప్రపంచకప్‌ సన్నద్ధత కోసం వార్నర్‌ స్వదేశానికి వెళ్లిపోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు వార్నర్‌, అటు సన్‌రైజర్స్‌ సభ్యులు ఉద్వేగానికి గురయ్యారు. “సన్‌రైజర్స్‌ కుటుంబం నాకిచ్చిన మద్దతు మరువలేను. ఈ విషయంలో నా కృతజ్ఞతను మాటల్లో చెప్పలేను. నేను గత ఏడాది ఐపీఎల్‌కు దూరమైన సమయంలోనూ నాకు అండగా నిలిచారు. లీగ్‌లో ఆడేందుకు చాన్నాళ్లు ఎదురు చూశాను. మళ్లీ ఇక్కడ ఆడటం గొప్ప అనుభూతినిచ్చింది. ప్రపంచకప్‌ ముంగిట నాకు ఐపీఎల్‌ ఒక మెట్టు లాంటిది. ఆ టోర్నీ కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా” అని వార్నర్‌ పేర్కొన్నాడు.

సన్‌రైజర్స్‌ ఆటగాళ్లందరికీ తర్వాతి మ్యాచ్‌ నుంచి వార్నర్‌ లేని లోటు కనిపిస్తుందని, అతడికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా’నని స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ట్విట్ చెప్పాడు. వార్నర్ దిగిన సెల్ఫీ ఫోటోని షేర్ చేశాడు.