వేసవి ఆశలన్నీ మహర్షి పైనే.. !

ఈ వేసవి సీజన్ లో అసలైన పసందు కనిపించడం లేదు. బ్యాక్సాఫీసుకు సినిమాల వరద కనిపించడం లేదు. ప్రీ సమ్మర్ లో వచ్చిన సినిమా పెద్దగా ఫేర్ చేయలేదు. పీక్ సమ్మర్ స్టార్టింగ్ లో వచ్చిన ‘మజిలీ’ ఆ టైమ్ ను బాగానే క్యాష్ చేసుకుంది. చిత్రలహరి, జెర్సీ, కాంచన సినిమాలతో కాస్త ఫ్లో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ రావాల్సిన సినిమాలు ‘అవెంజర్స్’ ఎఫెక్ట్ తో వాయిదపడ్డాయి.

ప్రీ సమ్మర్ లో ఎన్నికలు, ఐఎపీల్ ఎఫెక్ట్ పడింది. పీక్ సమ్మర్ స్టార్టింగ్ లో అవెంజర్స్ ఎఫెక్ట్ కనిపించింది. ఇక, ఇప్పుడు ఆశలన్నీ పీక్ సమ్మర్ లో రాబోతున్న మహర్షి పైనే. రెండు వారాలుగా సరైన సినిమా లేకపోవడం, అసలు ఇప్పటివరకు సమ్మర్ సీజన్ లోనే భారీ సినిమా లేకపోవడంతో.. మహర్షి కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మహర్షి నటిస్తున్న 25వ సినిమా కావడం, ఇందులో మహేష్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతుండటంతో.. సినిమా ఓపెనింగ్స్ ను కచ్చితంగా ఓ రేంజ్ లో ఉంటాయని భావిస్తున్నారు. మొత్తంగా.. అసలైన సమ్మర్ సినిమాగా మహర్షి నిలుస్తుందేమో చూడాలి.