‘విజయ్.. నీ లైఫ్ సూపర్’గా ఉందమ్మా : మహేష్
సూపర్ స్టార్ మహేష్ ‘మహర్షి’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక బుధవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి టాలీవుడ్ సన్సేషన్ విజయ్ దేవరకొండ హాజరయ్యారు.
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘మహేష్ అభిమానిగా ఇక్కడికొచ్చా. ఎంజాయ్ చేయడానికి వచ్చా. మహేష్ సినిమాల కోసం క్యూలో గంటల తరబడి నిలబడిన రోజులున్నాయి. ‘మురారి’ సినిమా టికెట్స్ కోసం పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఇక, సినిమాల్లోకి వచ్చాక ఓ అవార్డు ఫంక్షన్ లో మహేష్ ని చూశా. నేను ఆరో వరుసలో కూర్చొన్నా. అప్పుడే మహేష్ వచ్చి ముందు వరుసలో కూర్చొన్నారు. అప్పుడు అనుకొన్నాను ఏం లైఫ్ రా బాబు. అలా ఉండాలి అనుకొన్నా. పెళ్లి చూపులు రిలీజైన తర్వాత మహేష్ ట్విట్ చేశారు. విజయ్ అద్భుతంగా నటించారని రాశారు. దీంతో ఫిదా అయిపోయా. ఫుల్ హ్యాపీగా ఫీలయ్యా’నన్నారు.
ఆ తర్వాత మాట్లాడిన మహేష్ విజయ్ పై సటైర్ వేశాడు. ‘యంగ్ హీరోల్లో విజయ్ అంటే ఇష్టం. ఆయన టాలెంట్ నచ్చుతుంది. అర్జున్ రెడ్డి సూపర్భ్. విజయ్ మాట్లాడిన అవార్డ్ ఫంక్షన్ ని మహేష్ గుర్తు చేస్తూ.. ‘నీ లైఫ్ సూపర్ గా ఉందమ్మా.. ‘ అంటూ విజయ్ పై సటైర్ వేశారు. దీంతో స్టేజీపై నవ్వులు పూశాయి. ఓ సారి నా సినిమా షూటింగ్ కి వచ్చి కలిశారు విజయ్. చాలా విషయాలు మాట్లాడుకొన్నాం’ అన్నారు మహేష్.