నవంబర్ 1 నుంచి రేషన్ బంద్..
రేషన్ షాపులను రద్దు చేసే యోచనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గాలని డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు గత కొంత కాలంగా ఆందోళన బాట పట్టారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్లు సమావేశమై సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 1 నుంచి 5 వరకు రేషన్ షాపులు మూతపడనున్నాయి.
రేషన్ డీలర్ల కు ఉద్యోగ భద్రత, వేతన భత్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె చేయనున్నారు. అన్ని రాష్ట్రల కంటే మెరుగైన సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న 415కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. సివిల్ సప్లై గోదాముల వద్ద మాల్ లిఫ్ట్ చేయకుండా నిరసనలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.