పవన్’తో చంద్రబాబు రహస్య చర్చలు.. ?


ఏపీలో తెదేపాతో జనసేన రహస్య ఒప్పందం కుదుర్చుకొన్నది ఓపెన్ సీక్రెట్. టికెట్ల కేటాయింపు, ఎన్నికల ప్రచారం చేసిన తీరుని చూస్తే అది అర్థమవుతోంది. ఐతే, ఇటీవల చంద్రబాబు, పవన్ రహస్య చర్చలు జరిపినట్టు సమాచారమ్. విజయవాడ సమీపంలో దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చినప్పుడు ఇరువురి మధ్య సమావేశం జరిగినట్లు చెబుతున్నారు.

వీరి భేటీని సచ్చిదానంద స్వామి ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో వచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. ఎలా ఉంటే ఏం చేయాలనే విషయాలపై కూడా వారిద్దరు మాట్లాడుకున్నట్లు ఊహాగానాలు తెలుస్తోంది. కేంద్రంలో రాజకీయ పరిస్థితుల గురించి ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారమ్. ఈ రహస్య చర్చలు నిజమైతే.. తెదేపా-జనసేనల దోస్తానా ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా నిజం అయినట్టే.