గండం గడిచింది.. తీరం దాటిన ఫొని తుఫాన్ !


ఏపీకి ఫొని తుఫాన్ గండం గడించింది. డిశాలోని పూరీ సమీపంలో ఈ ఉదయం ఫొని తీరాన్ని తాకింది. ప్రస్తుతం ఇది గంటకు 22 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఉదయం 11 గంటల సమయంలో పూర్తిగా తీరాన్ని దాటనుంది. ఆ సమయంలో 200 నుంచి 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటిన తర్వాత క్రమంగా తుపాను బలహీన పడనుంది.

ఫొని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కంచిలిలో 12సెంటీమీటర్ల వర్షపాతం, సోంపేటలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గాలలుకు పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. ఇంటిపై కప్పులు లేచిపోయాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్డు, రైలు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తీర ప్రాంత రోడ్ల మార్గాలు కోసుకుపోయాయి. ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, అరటి, జీడి, కొబ్బరి వంటి తోటలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఫొని తీరం దాటుతుండటంతో.. ఏపీకి పెద్ద గండం గడిచినట్టయింది.