మహేష్26 : రమ్యకృష్ణ, విజయశాంతిల పాత్రలు.. ఇవే !


‘మహర్షి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సూపర్ స్టార్ మహేష్. ఈ నెల 9నే మహర్షి విడుదల. మహర్షిని చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ కాలరెగిరేయడం ఖాయమని చెబుతోంది చిత్రబృందం. ట్రైలర్ కూడా ఆ రేంజ్ లో ఉండటంతో మహర్షి కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక, ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ సినిమా తెరకెక్కనుంది.
ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్లు విజయశాంతి, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా, వీరి కనిపించే పాత్రల వివరాలు బయటికొచ్చాయ్. సినిమాలో మహేష్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ, అత్త పాత్రలో విజయశాంతి కనిపిస్తారని తెలిసింది. ఈ రెండు పాత్రలు అద్భుతంగా ఉంటాయని చెబుతున్నారు. సీనియర్ నటుడు జగపతి బాబు కూడా మహేష్26లో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం హీరోయిన్ ని ఫైనల్ చేయాల్సి ఉంది. హీరోయిన్ గా రష్మిక మందన పేరు వినిపిస్తోంది.