సిద్ధార్థ్ కసి ఎవరిపైనా.. ?
హీరో సిద్దార్థ్ నేరుగా తెలుగు సినిమాల్లో నటించి చాలా ఏళ్లవుతోంది. ఎక్కువగా తమిళ చిత్రాలతోనే బిజీగా ఉంటున్నారు. ఇటీవల ఆయన నటుడు సునీల్‌తో కలిసి దిగిన సెల్ఫీని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘జీవితాంతం నా బెస్ట్ ఫ్రెండ్’ అని క్యాప్షన్ ఇచ్చారు. సునీల్‌తో కలిసి ‘బొమ్మరిల్లు’ సినిమాలో నటించిన రోజులను గుర్తుచేసుకున్నారు. ఈ ఫోటోని చూసిన తెలుగు ప్రేక్షకులు మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎప్పుడొస్తారు ? తెలుగు సినిమాలు ఎప్పుడు చేస్తారు ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ అభిమానుల కోసం ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘ఎవడేమన్నా నేను మళ్లీ తిరిగొస్తాను. నేను చేస్తున్న ఈ ప్రామిస్‌ను గుర్తుపెట్టుకోండి. మరోసారి నా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తాను. నాకు 18 నెలలు సమయం ఇవ్వండి ప్రేక్షకులారా. నాపై మీకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. కష్టపడతాను. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేతిలో ఉన్నాయి. మాట్లాడుకుందాం’ అని పోస్ట్ చేశారు. ఇంతకీ సిద్దార్థ్ తెలుగులోకి వస్తే ఎవరెందుకు అనుకొంటారు ? ఇంతకీ సిద్దార్థ్ కసి ఎవరిపైనా.. ?? అన్నది చర్చనీయాంశంగా మారింది.
గతంలో సిద్దార్థ్-సమంత ప్రేమికులంటూ ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే ఒకట్రెండు సార్లు సామ్-సిద్ధార్థ్ ఫ్యామిలీతో కలిసి బయటకనిపించారు. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత చైతూ-సామ్ లవ్ స్టోరీ వెలుగులోకి రావడంతో.. ఆ ప్రచారానికి తెరపడింది. చైతూని పెళ్లాడిన సామ్.. హాయిగా కాపురం చేసుకొంటోంది. మరోవైపు, వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతోంది.
Bestie for life. @Mee_Sunil ❤️ #NvNv #Bommarillu #ChukkalloChandrudu #Aata #OY pic.twitter.com/ig6s2dUoFF
— Siddharth (@Actor_Siddharth) May 1, 2019