ఆప్ ఎమ్మెల్యే ఈజీగా బీజేపీలో చేరారు

ఆప్‌ ఎమ్మెల్యేలను కొనడం అంత ఈజీ కాదని ఆ పార్టీ అధినేత, ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్న సంగతి తెలిసిందే. 14 మంది ఆప్‌ ఎమ్మెల్యేలు బిజెపితో టచ్‌లో ఉన్నారని, వారు తమతో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రి విజయ్‌ గోయెల్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా క్రేజీవాల్ పై స్టేట్ మెంట్ ఇచ్చారు. కేజ్రీవాల్‌ ధీమా వ్యక్తం చేసిన కొద్ది గంటల్లోనే ఒక ఎమ్మెల్యే పార్టీని వీడి భాజపాలో చేరారు.

ఢిల్లీలోని గాంధీనగర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే అనిల్ వాజపేయి కేంద్ర మంత్రి విజయ్‌ గోయల్‌ సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకున్నారు. అవినీతిని నిర్మూలించాలనే లక్ష్యంతోనే ఆప్‌ ఏర్పాటైందని, ఇప్పుడు ఆ లక్ష్యం పక్కదారి పట్టినందునే తాను పార్టీని వీడి భాజపాలో చేరినట్లు అనిల్‌ వెల్లడించారు. ఒక్కో ఆప్‌ ఎమ్మెల్యేకు భాజపా రూ.10 కోట్లు ఇవ్వజూపుతోందని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని గోయల్‌ అన్నారు. తాము ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం లేదని, ఆప్‌ విధానాలతో విసిగిపోయిన 14 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.