ఒడిషాకి ఏపీ సాయం
ఏపీ, ఒడిషా రాష్ట్రాలు ఫొని తుఫాన్ దెబ్బని చవి చూశాయి. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఫొని బీభత్సం సృష్టించింది. ప్రాణ నష్టం జరగకపోయినా.. పంట నష్టం భారీగానే జరిగింది. చాలా చోట్లో విద్యుత్ స్తంభాలు, సెల్ టవర్లు దెబ్బతిన్నాయి. ఇంటి పైకప్పులు లేచిపోయాయి. ప్రస్తుతం ఈ నష్టాన్ని అంచనా వేసి.. కేంద్రానికి నివేదిక అందజేసే పనిలో ఏపీ ప్రభుత్వం ఉంది.
ఏపీని మించిన నష్టం ఒడిషాలో జరిగింది. తుఫాన్ తీరం దాటేసమయంలో దాదాపు 200 నుంచి 250కిలో మీటర్ల వేగంతో గాలులు వీశాయి. ఆ దాటికి లక్షకుపైగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. తుఫాన్ కారణంగా భారీగా నష్టపోయిన ఒడిషాకి ఏపీ ప్రభుత్వం సాయం చేయనుంది. ఒడిశాకు 2 లక్షల టార్ఫాలిన్లు, 200 యాంత్రిక రంపాలను పంపించనుంది. విద్యుత్ స్తంభాలను కూడా పంపించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.