బన్నీ ప్రేమకు పదిహేనేళ్లు
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రేమకు పదిహేనేళ్లు నిండాయ్. ఆయన తొలిసారి ‘ఫీల్ మై లవ్’ అంటూ ప్రేమను కురిపించిన సంగతి తెలిసిందే. 2009లో వచ్చిన సుకుమార్-బన్నీల ‘ఆర్య’ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. వన్ సైడ్ లవ్ కు క్రేజ్ ని తీసుకొచ్చింది. ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. దాంతో ఆర్యని సూపర్ హిట్ చేశారు. ఈ సినిమా విడుదలై నేటికి 15యేళ్లు కావొస్తోంది.
ఈ సందర్భంగా బన్నీ ఇన్ స్ట్రోగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు. “ఇప్పటికీ నేను అంతే ప్రేమను ఫీలవుతున్నాను. నా జీవితంలో ‘ఆర్య’ మ్యాజికల్ మూవీ. ఇది నా జీవితాన్ని మార్చేసింది. సినిమా విడుదలై నేటికి పదిహేనేళ్లు పూర్తవుతోందంటే నమ్మలేకపోతున్నాను. ధన్యవాదాలు సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు, దిల్రాజు. అన్నింటికి మించి నన్ను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులకు పేరుపేరునా కృతజ్ఞతలు” అంటూ రాసుకొచ్చారు.
ఆర్య సీక్వెల్ గా 2009లో ఆర్య2 వచ్చింది. మంచి విజయాన్ని అందుకొంది. అంతేకాదు.. బన్నీ-సుకుమార్ కలయికలో హ్యాట్రిక్ సినిమా ఫిక్సయింది. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత బన్నీ-సుకుమార్ ల హ్యాట్రిక్ సినిమాని తీసుకురానున్నారు. బహుశా.. ఈ చిత్రానికి ఆర్య3 టైటిల్ పెడతారేమో.. !