ఆ హీరో విడాకుల వెనక అసలు కథ !

కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్‌ భార్యతో విడాకులు తీసుకొన్నారు. యేడాది క్రితమే ఇది జరిగింది. కానీ బయటికిరాలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన విడాకుల కథని బయటపెట్టాడు విష్ణు విశాల్. దానికి గల కారణాలని కూడా చెప్పాడు. 2011లో నిర్మాత, నటుడు కె.నటరాజ్‌ కుమార్తె రజనీని విష్ణు విశాల్ పెళ్లి చేసుకొన్నాడు. వీరికి ఆర్యన్‌ అనే కుమారుడు వున్నాడు. 6 ఏళ్ల వివాహ బంధంలో అభిప్రాయ భేదాలు రావడంతో గత ఏడాది నవంబరులో విడాకులు తీసుకున్నారు.

వ్యవహారం విడాకుల వరకు ఎందుకు వెళ్లింది ? అంటే.. పెళ్లికి ముందు, పెళ్లైన కొత్తలో కూడా విష్ణు విశాల్ సిగ్గరి. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. అమ్మాయిలతో అయితే ఇంకా కష్టం. దీంతో సినిమాలో లవ్ సీన్స్ లో నటించేటప్పుడు ఇబ్బంది పడేవాడట. ఆ సమస్య నుంచి బయటపెడేందుకు కోస్టార్స్ తో మాట్లాడటం మొదలెట్టాడు. అది ఆయన భార్యకు నచ్చలేదట. దీంతో వ్యవహారం విడాకుల వరకు వెళ్లినట్టు విష్ణు విశాల్ చెప్పుకొచ్చాడు. అసలు నిజం ఇదే అయితే మాత్రం.. సిల్లీ రిలీజ్ అనే చెప్పాలి.