ప్రియాంక తలపై పిచ్చుక గూడు
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకి పైత్యం ఎక్కువైంది. ప్రియాంక అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌ను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. 2017లో అమెరికాలోని లాస్ఏంజెల్స్‌లో జరిగిన ‘మెట్ గాలా’ అనే కార్యక్రమంలో ప్రియాంక.. అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌ను కలిశారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్లు డేటింగ్ చేసిన అనంతరం పెద్దల సమక్షంలో గతేడాది డిసెంబర్‌లో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఈ నేపథ్యంలో ఈ యేడాది ‘మెట్ గాలా’ కార్యక్రమంలో ప్రియాంక-నిక్ జంట ప్రత్యేక ఆకర్షిణగా నిలుస్తారని అందరు భావించారు. ఈ ప్రొగ్రామ్ పై ఆసక్తి కనబరుస్తూ ప్రియాంక ముందస్తు ట్విట్లు కూడా చేశారు. దీంతో నిక్, ప్రియాంక ఏ డ్రెస్సులో మెరుస్తారనే చర్చసాగింది. ఐతే, ఈ జంట ‘మెట్ గాలా’ ఎవరు ఊహించలేనంత కొత్తగా కనిపించింది. సోమవారం అమెరికాలో జరిగిన ఈ ప్రొగ్రామ్ కు ప్రియాంక పిట్టగూడు హెయిర్ స్టయిల్ తో హాజరైంది. స్టయిల్ కొత్తగా ఉన్నా.. ఆ స్టయిలో ప్రియాంకని చూడలేకపోయారు జనాలు.
సోషల్ మీడియా వేదికగా ప్రియాంక హెయిర్ స్టయిల్ పై సెటైర్లు పడుతున్నాయి. ఆమె హెయిర్ స్టైల్‌ను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. పక్కన నిక్ లేకుంటే ప్రియాంకను అసలు గుర్తు పట్టలేమని కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే.. ప్రియాంకకి పైత్యం ఎక్కువైంది. అందుకే తలపై పిట్టగూడుని తగిలించుకొందని కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా.. పిట్టగూడు హెయిర్ స్టయిల్ తో ప్రియాంక హెడ్ లైన్స్ లో నిలుస్తోంది.
Priyanka Chopra's 😍😂 new version of fashion…😂😂#priyankachopra pic.twitter.com/8FclVmCgfC
— Chowkidar Pikachu🕵️🇮🇳🎸 (@goutampandey11) May 7, 2019