ఒడిషాకు తెలంగాణ పెద్ద సాయం

ఫొని తుఫాన్ దెబ్బపడిన ఒడిషా రాష్ట్రానికి సాయం చేసేందుకు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. తుఫాన్ కారణంగా ఒడిషాలో విద్యాత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. దాన్ని పునరుద్దరించేందుకు ఒడిషా ప్రభుత్వం తెలంగాణ సాయం కోరింది. అందుకు కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించింది. మంగళవారం 1000 విద్యుత్ ఉద్యోగులని ఒడిషాకి పంపింది. ఆ రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ పరికరాలని సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విషయాని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

ఒడిషా, ఏపీ రాష్ట్రాలపై ఫొని ఎఫెక్ట్ పడిన సంగతి తెలిసిందే. ఏపీలో పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ఒడిషాని మాత్రం ఫొని వణికించింది. తుఫాన్ తీరందాటే సమయంలో 200 నుంచి 250కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో సెల్ టవర్లు, ఇంటిపైకప్పులు, విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ప్రస్తుతం వాటిని పునరుద్దరించే పనిలో ఒడిషా ప్రభుత్వం ఉంది.

ter.com/hashtag/FaniCyclone?src=hash&ref_src=twsrc%5Etfw”>#FaniCyclone. On Tuesday 1000 employees from various power utilities of Telangana State have left for Odisha.

— Telangana CMO (@TelanganaCMO) May 7, 2019