కామ్రేడ్స్ సినిమా వాయిదా పడింది
అనుకొన్నదే జరిగింది. విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రెడ్’ సినిమా వాయిదా పడింది. ఈ నెల 31 రావాల్సిన ‘డియర్ కామ్రేడ్’ జులై26కు వాయిదాపడింది. ఈ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది.
‘డియర్ కామ్రేడ్’ దక్షణాది అన్ని బాషల్లో విడుదల కానుంది. ఐతే, మే31 కోలీవుడ్ లో రెండు భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘ఎన్జీకె’ మే31న విడుదలకానుంది. దీంతో పాటు చియాన్ విక్రమ్ సినిమా అదే రోజున రానుంది. ఈ నేపథ్యంలో డియర్ కామ్రేడ్ వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉందనే ప్రచారం జరిగింది. ఇప్పుడది జరిగింది. ఐతే, విజయ్ సినిమా చాలా దూరం వాయిదాపడింది. మేలో కుదరకుంటే జూన్ లో రావాల్సి ఉంది. ఏకంగా జులై ఆఖరి వారానికి వెళ్లడం విశేషం.
ఈ చిత్రానికి కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. విజయ్ దేవరకొండ-రష్మిక మందన జంటగా నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన దక్కింది. ట్రైలర్ లో విజయ్-రస్మిక ల లిప్ లాక్ సీన్ హైలైట్ గా నిలిచింది. సినిమాలో ఆ సీన్ ని ప్రేక్షకులు ఆస్వాదించడం ఖాయంగా కనిపిస్తోంది. ఐతే, కామ్రేడ్ వెనక్కి వెళ్లడంపై రౌడీ ఫ్యాన్స్ నిరాశ చెందారనే చెప్పాలి.