విశాఖలో హైదరాబాద్ తడబాటు
ఐపీఎల్ 12 ఆఖరి అంకానికి చేరుకొంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్ చేరింది. ఇక విశాఖ వేదికగా జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గప్తిల్ (38; 19 బంతుల్లో, 1×4, 4×6), మనీశ్ పాండే (30; 36 బంతుల్లో, 3×4), కెప్టెన్ విలియమ్సన్ (28; 27 బంతుల్లో 2×4), విజయ్‌శంకర్ (25; 11 బంతుల్లో 2×4, 2×6), మహ్మద్ నబీ (20; 13 బంతుల్లో 3×4, 1×6) రాణించారు.
భారీ భాగస్వామ్యాలు నమోదుకాకుండా కీలక సమయంలో ఢిల్లీ జట్టు వికెట్లు కూల్చింది. దీంతో హైదరాబాద్ పై ఒత్తిడిపెంచిండి. ఆఖర్లో కీమో పాల్ వేసిన ఆఖరి ఓవర్లో హైదరాబాద్ మూడు వికెట్లు కోల్పోయి కేవలం 9 పరుగులే చేసి 162 పరుగులకు పరిమితమైంది. దిల్లీలో జట్టులో కీమో పాల్ 3, ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీశారు. అమిత్ మిశ్రాకు ఒక వికెట్ దక్కింది.
ఇక, 163పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు నిలకడగా ఆడుతోంది. 7.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 65 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది. ఓపెనర్లు పృధ్వీ షా 42 (29బంతుల్లో), ధావన్ 19 (17బంతుల్లో) పరుగులతో క్రీజులో ఉన్నారు.