ఖలీల్ మేజిక్.. షా, అయ్యర్ అవుట్ !

సన్ రైజర్స్ బౌలర్ ఖలీల్ మేజిక్ చేశాడు. ఒకే ఓవర్ లో ఊపుమీదున్న ఢిల్లీ బ్యాట్స్ మెన్స్ పృధ్వీ షా (56), శ్రీయస్ అయ్యార్ (8) అవుట్ చేశాడు. సన్ రైజర్స్ ని మళ్లీ పోటిలోకి తీసుకొచ్చాడు. 14 ఓవర్లలో ఢిల్లీ 114 పరుగులు చేసింది. క్రీజులో రిషభ్ పంత్ 12, మున్రో 14 ఉన్నారు. 6 ఓవర్లలో ఢిల్లీ 49పరుగులు చేయాల్సి ఉంది.

అంతకుముందు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గప్తిల్‌ (38; 19 బంతుల్లో, 1×4, 4×6), మనీశ్‌ పాండే (30; 36 బంతుల్లో, 3×4), కెప్టెన్‌ విలియమ్సన్‌ (28; 27 బంతుల్లో 2×4), విజయ్‌శంకర్‌ (25; 11 బంతుల్లో 2×4, 2×6), మహ్మద్‌ నబీ (20; 13 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. దిల్లీలో జట్టులో కీమో పాల్‌ 3, ఇషాంత్‌ శర్మ రెండు వికెట్లు తీశారు. అమిత్‌ మిశ్రాకు ఒక వికెట్‌ దక్కింది.