ఆన్ లైన్ లో ‘మహర్షి’ బిట్ సీన్స్ లీక్.. !


థియేటర్స్ లో రిషి ప్రయాణం కొద్దిసేపటి క్రితమే మొదలైంది. అప్పుడే రిషి జర్నీ అద్భుతం. మహర్షి మెగా బ్లాక్ బస్టర్ హిట్ అని ప్రేక్షకులు తేల్చేశారు. ఇక, మహేష్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవ్. థియేటర్స్ లోనే కాలరెగిరేస్తున్నారు. ఆ రేంజ్ లో మహర్షి ఉంది. ఐతే, మహేష్ అభిమానులే ‘మహర్షి’ని లీక్ చేస్తుండటం బాధని కలిగించే విషయం. థియేటర్స్ నుంచి మహర్షి సంబంధించిన హైలైట్ బిట్ సీన్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే నాలుగైదు బిట్ సీన్స్ ట్విట్టర్ లో వైరల్ గా మారాయి.

అభిమానుల ఆతృతని అర్థం చేసుకోగలం. కానీ, మహర్షి కి సంబంధించిన వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేయరాదని ముందే చిత్రబృందం కోరింది. అయినా.. అభిమానులు పట్టించుకోవడం లేదు. మహర్షి బిట్ సీన్స్ ని షేర్ చేస్తూనే ఉన్నారు. ఇది అభిమానం, ప్రేమతో చేసిన పనియే. అయినా.. మీరు అభిమానించే మహేష్ సినిమాకి పెద్ద ఎత్తున డ్యామేజ్ చేయనుంది. దయచేసి.. ఇకపై మహర్షి వీడియోస్ ని షేర్ చేయకూడని మహేష్ అభిమానిగా కోరుతున్నాం.

.