హృతిక్ ని హెచ్చరించిన కంగనా చెల్లెలు
బాలీవుడ్ లో హృతిక్ రోషన్, కంగనా రనౌత్ ల వైరం గురించి తెలిసిందే. కొన్నేళ్ల పాటు వీరి గొడవ సాగింది. తీర్పు చెప్పలేక చివరికి కోర్టులు కూడా చేతులెత్తేశాయ్. ఆ తర్వాత హృతిక్, కంగనా సలైంట్ అయిపోయారు. ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు. ఐతే, బద్ద శత్రువులైన హృతిక్,కంగనా సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతుండటం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
హృతిక్ రోషన్ నటిస్తున్న ‘సూపర్ 30’, కంగన నటిస్తున్న ‘మెంటల్ హై క్యా’ సినిమా జులై 26న ప్రేక్షకుల ముందుకురానున్నాయి. హృతిక్ తో పోటీపడటం కంగనాకి కూడా ఇష్టం లేదు. దీంతో తన సినిమాని వాయిదా వేయాలని నిర్మాత ఏక్తా కపూర్‌ను కోరందట. అందుకు ఏక్తా ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో హృతిక్ తో పోటీపడటం కంగనాకి తప్పడం లేదు.
మరోవైపు, ఇప్పటినుంచే కంగనాని టార్గెట్ చేయడం మొదలెట్టారు హృతిక్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో కంగనా సోదరి రంగేలీ.. హృతికి గట్టి హెచ్చరికలు చేసింది. ‘నేరుగా పోరాడే ధైర్యం లేక వెనక నుంచి నోటికొచ్చినట్లు మాట్లాడేవారి గురించి ఏం చెప్తాం? నువ్వు, నీ పీఆర్వో కంగనను ఎంతగా అవమానించాలని చూస్తే.. తను అంతగా మిమ్మల్ని తొక్కిపడేస్తుంది. హృతిక్.. చూస్తూ ఉండు. కంగన నిన్నేం చేస్తుందో. ఇక నీ పనైపోయింది’ అంటూ హెచ్చరించింది.