నా పేరు సీత నేను గీసిందే గీత

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీత’. ఈ నెల 24న విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ‘మహర్షి’ థియేటర్స్ లో ప్రదర్శించారు. దీంతో ట్రైలర్ కి మంచి స్పందన వస్తుందని చిత్రబృందం తెలిపింది. ఇక, ట్రైలర్ విషయానికొస్తే స్టోరీ లైన్ లీక్ చేయకుండా డైలాగ్స్ ని హైలైట్ చేస్తూ కట్ చేశారు.

”నా పేరు సీత నేను గీసిందే గీత, ప్రాస బావుంది కదూ!” అంటూ కాజల్ అగర్వాల్ చెప్పే డైలాగ్‌

”ఇది పెద్ద కంచులా ఉందిరా! బాబూ” అని తనికెళ్ల భరణి చెప్పే డైలాగ్‌

”రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం తప్పు కాదండి. రాముడి భార్యను ఎత్తుకెళ్లడం తప్పు” అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పే డైలాగ్‌ ట్రైలర్‌లో ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ ఓ స్పెషల్ సాంగ్ చేశారు. అనిల్ సుంకర నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు