మోడీ పదవి కాపాడిన అడ్వాణీ
గురువుకే పంగనామాలు పెట్టిన నేతల్లో ప్రధాని నరేంద్ర మోడీ పేరు కూడా వినిపిస్తుంటుంది. భాజాపా అగ్రనేత లాల్ కృష్ణ అడ్వాణీ మోడీ రాజకీయ గురువు అన్నసంగతి తెలిసిందే. ఐతే, మోడీ ప్రధాని అయిన తర్వాత అడ్వానీ పక్కకి పెట్టేశాడు. కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. ఓ వేదికపై ఆయన్ని అవమానించిన వీడియాలో వైరల్ అయ్యింది కూడా. గతంలో మాత్రం అనేక సార్లు మోడీని కాపాడుతూ వచ్చాడు అగ్రనేత అడ్వానీ. దానికి సంబంధించిన ఓ ఘటనని తాజాగా భాజపా మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బయటపెట్టారు.
2002లో గోద్రా అల్లర్ల సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ మారణకాండ అనంతరం మోదీని నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పదవి నుంచి తొలగించడానికి నిర్ణయించుకున్నారట. ఒకవేళ అందుకు మోదీ నిరాకరిస్తే ఏకంగా ప్రభుత్వాన్నే రద్దు చేయాలన్న కఠిన నిర్ణయాన్నివాజ్‌పేయీ తీసుకున్నాడట. కానీ అప్పటి హోంమంత్రి లాల్ కృష్ణ అడ్వాణీ అందుకు అడ్డుపడడంతో ఆ నిర్ణయం అమలు చేయలేకపోయారని యశ్వంత్ సిన్హా వివరించారు.