‘మన్మథుడు2’ అంతా రివర్స్ అవుతుందట !


మన్మథుడు నాగార్జున ఈసారి రివర్స్ లో వెళ్తున్నాడట. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో ‘మన్మథుడు2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ‘మన్మధుడు’ సినిమాకు రివర్స్ అన్నట్లు వుంటుదట. సినిమాలో ఆఫీస్ బాస్ నాగ్ మొదటి నుంచి అమ్మాయిలతో అచ్చట్లు ముచ్చట్లు పెడతూ, వాళ్లకు హెల్పింగ్ గా వుంటాడట. అంటే ‘మన్మధుడు’లో నాగ్ పాత్రకు పక్కా రివర్స్ అన్నమాట. అమ్మాయిలతోనే నాగ్ అలా అంత కలివిడిగా ఎందుకు వుంటాడు అనేది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సమంతతో చెప్పిస్తారట. ఇందులో సామ్ ది గెస్ట్ రోల్. కేవలం రెండు రోజుల కాల్ షీట్ మాత్రమే ఇచ్చింది. 5నిమిషాలకి మించి కనిపించదట.

మన్మథుడులో అమ్మాయిలు అంటే చిర్రుబుర్రులాడే నాగ్ అలా ఎందుకు మారాడు అన్నది బాబాయ్ తనికెళ్ల నోటి వెంట చెప్పించాడు దర్శకుడు త్రివిక్రమ్. రెండో మన్మథుడులో ఆ పని సమంత చేయనుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నాగ్ కథని సమంత చెప్పబోతుంది. ఇక, ఈ సినిమాలో నాగ్ కి జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. చి ల సౌ సినిమా నచ్చి రాహుల్ రవీంద్రన్ కి మన్మథుడు 2 ఆఫర్ ఇచ్చాడు నాగ్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. నాగ్ కి హిట్ ఇవ్వాలనే కసితో ఉన్నాడు రాహుల్.