కాలరెగిరేసిన మహేష్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు కాలరెగిరేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘మహర్షి’. గత గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన మహర్షి మెగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకొంది. అంతకుమించి మంచి సినిమా, మహేష్ అద్భుతంగా నటించారని ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు, బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. ఏరియాల వారీగా నాన్ బాహుబలి రికార్డులు బద్దలవుతున్నాయి. ఈ ఆనదంలో మహర్షి చిత్రబృందం ఆదివారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్.. మహర్షి సినిమా చేసిందనందుకు గర్వంగా ఉంది. దర్శకుడు వంశీ గురించి ఇప్పటికే చాలా చెప్పను. సినిమాలో ప్రీ రిలీజ్ వేడుక వంశీ.. మహర్షి మహేష్ అభిమానులు కాలరెగిరేసే సినిమా అవుతుందన్నారు. అభిమానులే కాదు. నేను కాలరెగిరేస్తున్నానని మహేష్ కాలరెగిరేశాడు. ఆ తర్వాత దర్శకుడు వంశీకి ఓ హగ్ ఇచ్చారు. మహేష్ ఎన్నడూ.. ఇంత హ్యాపీగా కనిపించలేదు. బయట హీరోయిజం చూపించలేదు. మహేష్ కాలరెగిరేయడం..సన్సేషనల్ గా మారింది. ఆయన అభిమానులకి పండగే.