చెన్నై రనౌట్.. ముంబయిదే ఐపీఎల్ ట్రోఫీ !
ఫైనల్ లో చెన్నై రనౌట్ అయింది. ముంబై ఇండియన్స్ నిర్ధేశించిన 150పరుగుల లక్ష్యాన్ని చేధించి క్రమంలో రెండు కళ్లు చెదిరే రనౌట్లు ధోనీసేన కొంపముంచాయి. ధోనీ, వాట్సాన్ కీలక సమయాల్లో రనౌట్ కావడంతో చెన్నై ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ ఎంచుకొన్న ముంబై.. ఆరంభం అదిరింది. మొదటి మూడు ఓవర్లలో ఆ జట్టు స్కోరు 30. ఓపెనర్లు డికాక్, రోహిత్ శర్మ ఊపుమీద కనిపించారు. ఆ తర్వాత డికాక్, రోహిత్ స్వల్ప వ్యవథికో అవుట్ అవ్వడంతో పరిస్థితి పూర్తిగా మారింది.
స్కోర్ మందగించింది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (41 నాటౌట్; 25 బంతుల్లో 3×4, 3×6) జట్టును ఆదుకున్నాడు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ షేన్ వాట్సన్ (80; 59 బంతుల్లో 8×4, 4×6) పోరాడినా చివరి మెట్టుపై చతికిలపడ్డాడు. బుమ్రా (2/14), రాహుల్ చాహర్ (1/14) అద్భుత బౌలింగ్‌తో ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించారు.
#VIVOIPL 2019 Champions 🏆 – @mipaltan 🔥 pic.twitter.com/XPl5dzh2H6
— IndianPremierLeague (@IPL) May 12, 2019