దారుణం : మహిళలకు బదులుగా ఓటేసిన పోలింగ్ ఏజెంట్
ఆదివారం జరిగిన ఆరో విడత పోలింగ్ లో చోటు చేసుకొన్న ఓ ఘటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హర్యానాలోని ఫరీదాబాద్ నియోజకవర్గంలోని అసౌటి పోలింగ్ బూత్‌లో మహిళలకి బదులుగా పోలింగ్ ఏజెంట్ ఓట్లు వేయడం కలకలం రేపింది. పోలింగ్ బూత్‌లో కూర్చొన్న ఓ ఏజెంట్.. ఈవీఎం కంపార్ట్‌మెంట్ వద్దకు వెళ్లి అక్కడ మహిళ ఉండగానే అతడు ఓటేశాడు. ఇలా ముగ్గురు మహిళల ఓట్లు ఆ పోలింగ్ ఏజెంటే ఓటేశాడు. ఆ ఏజెంట్ ని పోలింగ్ అధికారులు బద్దలించకపోవడం గమనార్హం.
ఈ తతంగాన్ని అంతా అక్కడున్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ఈ సంఘటనపై ఫరీదాబాద్ జిల్లా ఎన్నికల అధికారి స్పందించారు. సదరు పోలింగ్ ఏజెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ముగ్గురు మహిళల ఓట్లు వేసినట్లు తమకు తెలిసిందని చెప్పారు. ఐతే, ఆ ఏజెంట్ ఏ పార్టీకి చెందినవారు అన్నది తెలియాల్సి ఉంది.
ये विडियो किसी ने भेजा है और हरियाणा के फरीदाबाद का होने का दावा किया है| इससे क्या फर्क पड़ता है कि ये कब का और कहाँ का है? लेकिन हैरान और दुखी हूँ ये देखकर कि सिस्टम कई बार कितना नपुंसक हो जाता है? ये नीच हरकत है🤔 pic.twitter.com/R8SRQ6U5aP
— Anurag Dhanda (@anuragdhanda) May 12, 2019