కాజల్ ని రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరంటే.. ?

‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేశాడు దర్శకుడు తేజ. ఈ సినిమా తర్వాత ఆయనకి ‘ఎన్టీఆర్ బయోపిక్’ ఆఫర్ వచ్చింది. ఐతే, కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని.. ‘సీత’ కథని రెడీ చేసుకొన్నాడు. ఆ కథని పొరపాటుని కాజల్ కి వినిపించా. ఇక ఆమె వదల్లేదు. ఎప్పటికైనా నేనే చేస్తానని పట్టుపట్టింది. ఎన్ని డేట్స్ కావాలంటే అన్ని ఇస్తానంది. అందుకే సీతగా కాజల్ ని తీసుకొన్నానని తెలిపాడు తేజ.

కాజల్ సరే.. బెల్లకొండ శ్రీనివాస్ ని ఎందుకు తీసుకొన్నట్టు ? అని అడిగితే.. షాకింగ్ విషయాలు చెప్పాడు తేజ. మరో ఆప్షన్ లేక బెల్లంకొండ తీసుకోవాల్సి వచ్చింది. ఏ హీరోకు కథ చెప్పినా కాజల్ ఫిక్స్ అని చెప్పగానే డ్రాప్ అయిపోయారు. ఫైనల్ గా బెల్లంకొండ ఒప్పుకున్నాడు. కాజల్ తనకు ఓకే అన్నాడు. అందుకే ఆయన్ని తీసుకోవాల్సి వచ్చిందన్నారు. మరీ.. కాజల్ మీద బెల్లకొండకి అంత ఇంట్రెస్ట్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. బహుశా.. ‘కవచం’ సినిమా సమయంలో చాలా క్లోజ్ అయినట్టున్నారు.

ఇంకో విషయం ఏంటంటే.. ? కాజల్ ని రిజక్ట్ చేసిన హీరోల లిస్టుని తేజ బయటికి చెప్పడం లేదు అది వృత్తి ధర్మం కావొచ్చు. మొత్తంగా కాజల్ కొందరు హీరోలకి బోర్ కొట్టిందనేది తేజ మాటలతో అర్థమవుతోంది. తేజ సీత… మోడ్రన్ సీత. రొమాంటిక్ సీత. తేజ రామాయణంలోని సీత ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.