గుడ్ న్యూస్ : రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్

చల్లని కబురు వచ్చేసింది. నైరుతి రుతుపవనాలు జూన్‌ 4న కేరళ తీరాన్ని తాకబోతున్నట్టు వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. సాధారణంగా జూన్‌ ఒకటో తేదీ కల్లా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. జులై మధ్యలో దేశం మొత్తం విస్తరిస్తాయి. ఐతే, ఈ యేడాది రుతుపవనాలు సమయానికి కేరళ తీరాన్ని తాకబోతున్నాయి.

ఈసారి దేశ దీర్ఘకాల సగటులో 93 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్కైమెట్ తెలిపింది. భారతదేశ వార్షిక వర్షపాతం
లో 70శాతం ఈ సీజన్‌లోనే అందుతుంది. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌ వ్యవసాయ రంగానికి ఇది ఆయువు పట్టు వంటిది. చల్లని కబురుతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.