పూనం, లక్ష్మీపార్వతిలను వేధించింది ఒక్కడే.. !
కొందరు వ్యక్తులు తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఫేస్‌బుక్, యూట్యూబ్ ఛానళ్లలో అశ్లీల కథనాలు, అసభ్య రాతలు పోస్ట్ చేస్తున్నారంటూ లక్ష్మీపార్వతి, పూనం కౌర్ వేర్వేరుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఐతే, ఈ వేర్వేరు కేసుల దర్యాప్తులో పోలీసులో ఓ కామన్ పాయింట్ గుర్తించారు. పూనమ్, లక్ష్మీపార్వతిలను వేధించిన వ్యక్తి ఒక్కరేనని దర్యాప్తులో తేలింది.
ఈ నేరంలో ఇతడితో పాటు మరో వ్యక్తి భాగస్వామిగా ఉన్నాడని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో వాళ్లు కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారని సమాచారం సేకరించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి లక్ష్మీపార్వతిపై అసభ్య వ్యాఖ్యలు, అశ్లీల కథనాలను పోస్ట్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. గత 8 నెలలుగా పూనం కౌర్‌పై ఈ రకమైన ప్రచారం చేస్తున్నారని దర్యాప్తులో తేలింది. నిందితులు డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారా ? వ్యక్తిగత కక్షతో చేస్తున్నారా ? లేదంటే వీరి వెనక ఎవరైనా ఉన్నారా..?? అనేది నిందితులు పట్టబడ్డాక తేలనుంది.