టాలీవుడ్ డ్రగ్స్ కేసు : ఎవ్వరికీ క్లీన్ చీట్ ఇవ్వలేదు


టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో 62 మందిని విచారించినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని, ఛార్జి షీట్‌లో సైతం బలమైన అంశాలను పొందుపరచలేదంటూ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు.

“సినీ తారలకు క్లీన్‌చిట్‌ ఇచ్చారన్న వార్తల్లో నిజం లేదు. డ్రగ్స్‌ కేసులో ఇప్పటివరకు ఏడు ఛార్జిషీట్లు దాఖలు చేశాం. ఐదుకు పైగా అభియోగ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంది. ఇంకా పలు ఆధారాలు రావాల్సి ఉంది. తమకు లభ్యమైన ఆధారాలను బట్టి ఎప్పటికప్పుడు అభియోగ పత్రాలు దాఖలుచేసి కోర్టుకు సమర్పిస్తున్నాం తప్ప ఎవరికీ క్లీన్‌చిట్‌ ఇవ్వలేదు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోం. పూర్తి ఆధారాలతో ముందుకెళ్తున్నాం” అని స్పష్టంచేశారు.