సీత కొత్తగా ఉంటుంది
తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన చిత్రం ‘సీత’. సోనూ సూద్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమా మే 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తేజతో కలిసి అనూప్ రూబెన్స్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అనూప్ మాట్లాడుతూ.. “తేజతో కలిసి పని చేయడం ఇది నాల్గో సినిమా. గతంలో జై, ధైర్యం, నేనే రాజు నేనే మంత్రి సినిమాల కోసం పనిచేశా. ‘సీత’ పాటలు కథలో కలిసిపోయి ఉంటాయి. టైటిల్ ‘సీత’ అయినప్పటికీ ఇది కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా కాదు. హీరో, హీరోయిన్, విలన్ ముగ్గురి పాత్రలకు ప్రాధాన్యం ఉంటుంది. ‘సీత’లాంటి కథను నేను ఇప్పటి వరకు చూడలేదు. ఇది చాలా కొత్తగా ఉంటుంది” అన్నారు.