‘సీత’ సెన్సార్ రివ్యూ

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ జంటగా నటించిన చిత్రం ‘సీత’. సోనూ సూద్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. ఈ సినిమా మే 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ పొందింది. టీజర్, ట్రైలర్ లతో సీత రొమాంటిక్ అనే విషయం అర్థమైంది. సినిమాలో గ్లామర్ డోస్ ఎక్కువగా ఉండటం కారణంగానే ‘యు/ఎ’ వచ్చిందని చెబుతున్నారు. ‘ఇది తేజ రామాయణం. ఆ కాలంలో సీత చాలా సాఫ్ట్ మహిళ. తన సీత మాత్రం అగ్రెసివ్ గా ఉంటుంది’ తేజ చెప్పిన సంగతి తెలిసిందే.