‘ఏబీసీడీ’ యుఎస్ ప్రీమియర్స్.. థియేటర్స్ లిస్ట్ !

అల్లు శిరీష్‌ కథానాయకుడు నటించిన చిత్రం ‘ఏబీసీడీ’. రుక్సార్‌ కథానాయిక. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. రేపే (మే17)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో యుఎస్ లో ప్రీమియర్ షోలు ప్రదర్శించబడే థియేటర్స్ వివరాలని చిత్రబృందం విడుదల చేసింది. మొత్తం 74చోట్ల ప్రీమియర్ షోస్ ప్రదరించబోతున్నారు. ఈ చిత్రాన్ని యుఎస్ లో బ్లూ స్కై సినిమాస్ విడుదల చేస్తోంది.

ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ ‘ఏబీసీడీ’ భారీ ఎత్తున విడుదల కానుంది. ప్రస్తుతం థియేటర్స్ లో ‘మహర్షి’ హవా మాత్రమే నడుస్తోంది. మరో సినిమా పోటీయే లేదు. ఈ నేపథ్యంలో విడుదల కాబోతున్న ఏబీసీడీ మహర్షి కి ఏ మేరకు పోటీ ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఆల్రెడీ మహర్షి ని చూసేసిన ప్రేక్షకులకి ఏబీసీడీ మంచి ఆప్షన్ గా మారనుంది. సినిమా బాగుంటే మహర్షి కలెక్షన్స్ కి కూడా గండిపడొచ్చు. అదే జరిగితే.. శిరీష్ కి ఓ హిట్టు దక్కినట్టే.. !!