తారక్ పుట్టినరోజు వేడుకలు క్యాన్సిల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈసారి పుట్టినరోజు వేడుకలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నట్టు తెలిసింది. ఈనెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు. ప్రతిసారీ ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్ని అభిమానులు ఘనంగా చేస్తుంటారు. ఐతే ఈసారి వేడుకలకు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. గత యేడాది ఆగస్టులో నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన దూరమై ఇంకా ఏడాది పూర్తి కాలేదు. అందుకే ఎన్టీఆర్ ఈసారి పుట్టిన రోజు జరుపుకోవట్లేదని సన్నిహితులు తెలిపారు.
మరోవైపు, తారక్ పుట్టినరోజు వేడుకలని సెలబ్రేట్ చేసుకొనేందుకు ఆయన అభిమానులు నెల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఐతే, తారక్ తాజా నిర్ణయం అభిమానులని నిరాశపరిచిందనే చెప్పాలి. ప్రస్తుతం తారక్ ‘ఆర్.ఆర్.ఆర్’లో నటిస్తున్నారు. ఇందులో కొమరం భీమ్ గా కనిపించనున్నారు. ఆయనకి జోడీగా ఎవరు అన్నది ఇంకా ఫైనల్ కాలేదు. 2020 వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది. తారక్ పుట్టినరోజు కానుకగా ఆర్ ఆర్ ఆర్ నుంచి స్పెషల్ గిఫ్ట్ రాబోతున్నట్టు సమాచారమ్.