రస్మిక.. రజనీ స్టయిల్ హీరోయిన్ !


టాలీవుడ్ లో హవా చూపిస్తున్న హీరోయిన్స్ లో రష్మిక మందన ఒకరు. ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.. ఈ ముద్దుగుమ్మ. ‘గీత గోవిందం’తో స్టార్‌ డమ్‌ సంపాదించుకుంది. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న మహేష్ సినిమా రస్మిక నే హీరోయిన్. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది.

తెలుగు రస్మిక చేసింది పట్టుమని మూడు సినిమాలు మాత్రమే. ఆమె నటించిన నాల్గో సినిమా ‘డియర్ కామ్రెడ్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, అప్పుడే రస్మిక తెలుగులో బాగా మాట్లాడేస్తోంది. అది ఎలా సాధ్యం అంటే.. ? తాను రజనీ స్టయిల్ హీరోయిన్ ని. ఒక్కసారి చెబితే.. వందసార్లు విన్నట్టు అన్నమాట అంటోంది.

“ఇంత త్వరగా తెలుగు భాష నేర్చుకుంటానని నేను అనుకోలేదు. సెట్లో ఎవరేం మాట్లాడినా శ్రద్ధగా వినేదాన్ని. నా వ్యక్తిగత సిబ్బందిని కూడా తెలుగులోనే మాట్లాడమని చెప్పేదాన్ని. చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు శ్రద్ధగా వినేదాన్ని. నాకెవరైనా ఒక్కసారి చెబితే, వందసార్లు చెప్పినట్టే. మైండ్‌లో అలా ప్రింటు గుద్దినట్టు గుర్తుండిపోతుంది. అందువల్లే తెలుగు త్వరగా నేర్చుకున్నా”నని చెబుతోంది రస్మిక. అంది రష్మిక.