నెం.4కు రాహుల్ ఫర్ ఫెక్ట్


టీమిండియాలో నెం.4 స్థానం గురించి చాన్నాళ్లుగా చర్చ సాగుతోంది. ఒకానొక సందర్భంగాలో నెం.4గా అంబటి రాయుడు ఫర్ ఫెక్ట్ అనుకొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ప్రకటించాడు. ఐతే, రాయుడు ప్రపంచకప్ జట్టులో లేడు. మరీ.. ఆ స్థానంలో ఎవరు ఆడబోతున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మాజీలు మాత్రం నెం.4గా కేఎల్ రాహుల్ ఫర్ ఫెక్ట్ అంటున్నారు.

టీమిండియా మాజీ సారథి వెంగ్‌సర్కార్‌ నాలుగో స్థానంలో కేఎల్‌ రాహుల్‌ సరైన ఎంపికని అభిప్రాయపడ్డారు. తన టెక్నిక్‌తో టాప్‌ ఆర్డర్‌కు సహకారం అందించగలడు. అవసరమైతే ఓపెనింగ్‌ చేయగలడు. అతడు కచ్చితంగా తుది జట్టులో ఉండాల్సిందే నాలుగో స్థానంలో స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌ ఆడాలని కోరుకుంటున్నానన్నారు. రాహుల్ కి ప్రత్యామ్నాయంగా జట్టులో విజయ్ శంకర్, దినేష్ కార్తీక్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక, మెగా టోర్నీలో టీమిండియా సెమీస్ కి చేరడం ఖాయమని మాజీ అంటున్నారు. మే 30 నుంచి వరల్డ్ కప్ మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే.