శిరీష్ క్రియేటివిటీ ‘ఏబీసీడీ’ని చెడగొట్టింది.. !

ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’పై నెగటివ్ టాక్ వినిపిస్తోంది. కథ-కథనం నాసికరంగా ఉన్నాయి. కామెడీ, ఎమోషన్స్.. ఒక్కటీ వర్కవుట్ కాలేదు. దానికితోడు స్లో నేరేషన్ ప్రేక్షకులని బాగా ఇబ్బంది పెట్టేలా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాతృకలో చాలా మార్పులు చేశారు. దాంతో ఆ ఫీల్ మిస్సయిందని చెబుతున్నారు. ఐతే, ఏబీసీడీ పాడవడం వెనక శిరీష్ క్రియేటివిటీ యే కారణమని సమాచారమ్. ఏబీసీడీ సినిమాను యథాతథంగా రీమేక్ చేయాలని ముందుగా భావించారు.

అదే కాన్సెప్ట్ తో సెట్స్ పైకి కూడా వెళ్లారు. కానీ సెట్స్ పైకి వెళ్లి తర్వాత అల్లు శిరీష్ లో క్రియేటివిటీ పెరిగింది. టాలీవుడ్ ట్రెండ్ కు తగ్గట్టు మరిన్ని మార్పులు చేయాలన్నాడు. కొత్తగా 50 సీన్లు రాసుకున్నారు. మళ్లీ వాటిని షూట్ చేశారు. వాటిలోంచి కొన్ని తీసేసి, మళ్లీ ఒరిజినల్ సినిమాలో సీన్లనే రాసుకొని షూట్ చేశారు. ఇలా గజిబిజిగా జరిగింది ఏబీసీడీ షూటింగ్. మాతృక ఏబీసీడీ నుంచి కేవలం 15 సీన్లని మాత్రమే వాడుకొన్నారు. ముఖ్యంగా అల్లు శిరీష్ నటనలో బాగా డెవలెప్ అయ్యాడని ఈ సినిమా చూపిద్దామనే తాపత్రయం కనబడింది. ఆ ఆతృత సినిమా కథని దెబ్బతీసింది. దానికితోడు టేకింగ్ నాసిరకంగా ఉండటంతో శిరీష్ కి మరో ప్లాప్ తప్పలేదు.