కాజల్’తో తేజ మరోసారి.. !

తేజ ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో కాజల్ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత కాజల్ ని కృష్ణ వంశీ ‘చందమామ’ని చేశాడు. ఈ సినిమా తర్వాత కాజల్ కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. స్టార్ హీరోయిన్ గా ఎదిరింది. కోలీవుడ్ లో రాణించింది. బాలీవుడ్ లోనూ మెరిసింది. కాజల్ పనైపోయింది అనే టైంలో మరోసారి తేజ ఆదుకొన్నాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో హిట్ ఇచ్చారు. కెరీర్ ని నిలబెట్టాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ‘సీత’ సినిమాలో నటిస్తుంది కాజల్. సీత ఈ నెల 24న విడుదల కానుంది.

కాజల్ తర్వాత సినిమా కూడా తేజ దర్శకత్వంలోనే ఉండబోతున్నట్టు సమాచారమ్. ఇదో లేడీ ఓరియెంటెడ్ సినిమా. థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో సాగే ఓ క‌థ‌ని కాజ‌ల్ కోసం తేజ సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. నిర్మాత‌లు కూడా రెడీగానే ఉన్నార్ట‌. `సీత‌`కు వ‌చ్చిన స్పంద‌న బ‌ట్టి.. వెంట‌నే ఈ కాంబోనే సెట్స్‌పైకి తీసుకెళ్లాలా? లేదంటే ఇంకొన్ని రోజులు ఆగాక మొద‌లెట్టాలా? అనేది ఆలోచిస్తార‌ట‌. ఇక, కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న భారతీయుడు 2 చిత్రం షూటింగ్ కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందని సమాచారమ్.