యాదాద్రిలో హజీపూర్ బాధిత కుటుంబాల దీక్ష భగ్నం


యాదాద్రిలో హజీపూర్ బాధిత కుటుంబాలు, గ్రామస్థులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షని పోలీసులు భగ్నం చేశారు. దాదాపు 100మంది పోలీసులు దీక్షాస్థలి చుట్టిముట్టారు. దీక్ష చేస్తున్నవారిని అరెస్ట్ చేశారు. వారిని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కి తరలించినట్టు సమాచారమ్. ఐతే, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసులు బలవంతంగా దీక్షభగ్నం చేయడంపై హజీపూర్ గ్రామస్థులు మండిపడుతున్నారు.

హజీపూర్ గ్రామంలో సైకో శ్రీనివాస్ ముగ్గురు యువతిలని రేప్ చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిందితుడు శ్రీనివాస్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు. ఐతే, శ్రీనివాస్ రెడ్డిని ఎంన్ కౌంటర్ చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి దీక్ష చేపట్టిన గ్రామస్థులు, బాధితకుటుంబాలు తమతో మాట్లాడటానికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే గొంగిడి సునీత రావాలని డిమాండ్ చేశారు. అది తీరని కోరిక ఏమీ కాదు. ఐతే, పోలీసులు మాత్రం బలవంతంగా దీక్షని భగ్నం చేశాయి.