మహేష్26లో ఫ్యాక్షన్ టచ్.. !

సూపర్ స్టార్ మహేష్25 ‘మహర్షి’ మెగా బ్లాక్ బస్టర్ హిట్. ప్రస్తుతం మహర్షి హిట్ కిక్కులో ఉన్నాడు మహేష్. వరుసగా సక్సెస్ మీట్స్ లో పాల్గొంటున్నారు. థియేటర్స్ సందర్శిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలని చుట్టేస్తున్నారు. ఈ హడావుడి అంతా ముగిశాక.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ సినిమా మొదలవ్వనుంది. ఐతే, ఈ సినిమా టైటిల్స్ విషయంలో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఈ సినిమా కోసం ‘స‌రిలేరు నీకెవ్వ‌రూ’ టైటిల్ ప్రచారంలో ఉంది. దీంతో పాటు ‘వాట్సాప్’ అనే వెరైటీ టైటిల్ వినిపిస్తోంది. సాధారణంగా అనిల్ రావిపూడి సినిమా టైటిల్స్ ఇంగ్లీష్ అక్షరాలతో ఉంటాయి. ఇక, మహేష్ టైటిల్స్ విషయంలో మూడక్షరాల సెంటిమెంట్ ని ఫాలో అవుతుంటారు. ఈ లెక్కన మహేష్26 కోసం ‘వాట్సాప్’ టైటిల్ ఫిక్స్ అయ్యేలా కనిపించింది.

ఇంతలో మరో మహేష్26 కోసం మరో టైటిల్ తెరపైకి వచ్చింది. ‘మహర్షి’ టైటిల్ క్లాస్ గా ఉంది. ఈ నేపథ్యంలో మహేష్ తదుపరి సినిమా కోసం కాస్త మాస్ టచ్ ఉండే టైటిల్ కావాలని అన్నారట. దీంతో ‘రెడ్డిగారి అబ్బాయి’ అయితే బాగుంటుందని దర్శకుడు అనిల్ అన్నారట. టైటిల్ ని చూస్తే.. ఈసారి మహేష్ ఫ్యాక్షన్ ని టచ్ చేసేలా కనిపిస్తోంది. ఫ్యాక్షన్ టచ్ కథతో అనిల్ మార్క్ కామెడీ మిస్ కాకుండా ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని తీసుకురాబోతున్నట్టు సమాచారమ్.

ఈ చిత్రంలో మహేష్ కి జంటగా రష్మిక మందన నటించనున్నారు. సీనియర్ హీరోయిన్లు విజయశాంతి, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. జూన్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. దసరా కానుకగా సినిమా విడుదలకి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారమ్.