ఎమ్మెల్యే సీతక్క కారు ఢీకొని చిన్నారి మృతి
ములుగు జిల్లా ఏటూరు నాగారంలో దారుణం చోటు చేసుకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కారు ఢీకొని చిన్నారి మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారమ్. ప్రస్తుతం వీరు ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఉదయం ఏటూరు నాగారం శివారులోని జీడివాగు సమీపంలో దంపతులు తమ చిన్నారిని తీసుకొని బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా దూసుకొచ్చిన ఎమ్మెల్యే కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమయంలో ఎమ్మెల్యే కారులో ఉన్నారా? లేదా ?? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే ఇప్పటి వరకు స్పందించక
పోవడం విచారకరం.