ఢిల్లీలో విజయ్ బైక్ రేస్
సౌత్ మెగా స్టార్ అనిపించుకోవాలనే ఆతృత విజయ్ దేవరకొండలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన సినిమాలని దక్షిణాదిన అన్నీ బాషల్లో విడుదలయ్యేలా ప్లాన్ చేసుకొంటున్నారు. భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ నటించిన ‘డియర్ కామ్రెడ్’ జులై 26న దక్షిణాదిన అన్నీ బాషల్లో విడుదల కాబోతుంది. టీజర్ తో విడుదల కాబోతున్న అన్నీ బాషల్లోనూ అంచనాలు పెరిగిపోయాయ్.
డియర్ కామ్రేడ్ కంటే ముందే ‘నోటా’ సినిమాతో తమిళ ప్రేక్షకులని పలరించాడు విజయ్. ఆయన చేస్తున్న మరో ద్విబాషా చిత్రం ఆదివారం (మే19) నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఆనంద్ వహిస్తున్నారు. ఇందులో విజయ్ బైక్ రేసర్ గా కనిపించబోతున్నాడు. తొలి షెడ్యూల్ ని ఢిల్లీలో ప్లాన్ చేశారు. తొలి షెడ్యూల్ లోనే బైక్ రేస్ సన్నివేశాలని చిత్రీకరించనున్నారు.
ఇందుకోసం విదేశాల నుంచి బైక్ రేసర్లను, డ్రోన్ లను, ఆపరేటర్లను, స్కార్పియో ఎక్విప్ మెంట్ ను తెప్పిస్తున్నారు. కేవలం రైస్ ట్రాక్ మీద షూటింగ్ పర్మిషన్ కే కోటికి పైగా చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీమూవీస్ నిర్మిస్తోంది. ఈ బ్యానర్ లో విజయ్ చేస్తున్న రెండో చిత్రమిది. ప్రస్తుతం క్రాంత్రిమాధవన్ దర్శకత్వంలో విజయ్ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రాశీఖన్నా హీరోయిన్. ఐతే, రెండు సినిమాల షూటింగ్ సమాంతరంగా పూర్తి చేసేలా విజయ్ ప్లాన్ చేసుకొన్నట్టు తెలుస్తోంది.