‘ఎన్ జికే’ తెలుగు రేటు రీజనబుల్ నేనా.. ?

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య నటించిన తమిళ చిత్రం ‘ఎన్ జికే’. తెలుగులోనూ అదే టైటిల్ తో విడుదల కానుంది. సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలు. జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని ప్రభు నిర్మించారు. ఈ సినిమా తెలుగు థియేటర్ హక్కులను రూ. 8 కోట్లకు సత్యసాయి సంస్థ దక్కించుకొంది.

సత్యసాయి సంస్థకు ప్రమోషన్స్ తో పనిలేదు. థియేటర్స్ రైట్స్ మాత్రమే ఆ సంస్థ తీసుకొంది. ప్రమోషన్స్ ఖర్చులు తమిళ నిర్మాతవే. పబ్లిసిటీ, డిజిటల్ ఖర్చులు అన్నీ తమిళ నిర్మాత ప్రభువే. ఈ సినిమా స్టార్ కాస్ట్ అంతా తెలుగు ప్రేక్షకులకి తెలిసినవారే. ఇది ప్లస్ కానుంది. దీనికితోడు.. ఈ నెలాఖరులో సినిమాలు ఏవీలేవు. ఏమాత్రం టాక్ బాగున్నా.. రూ. 8కోట్లు రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ నేపథ్యంలో ‘ఎన్ జికే’ తెలుగు రేటు గిట్టుబాటు అయ్యే ధరని చెప్పవచ్చు.