లగడపాటి ప్రివ్యూ వచ్చేసింది.. !!

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. అయినా.. ఆయన రాజకీయాలని హీటెక్కించగలరు. గత యేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమి అధికారంలోకి వస్తుందని హడావుడి చేశాడు. ఆ ధీమాతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత రెచ్చిపోయారు. కేసీఆర్ రిటైర్డ్మెంట్ తీసుకోబోతున్నారు. ఇకపై ఫాం హౌస్ కే పరిమితం కాబోతున్నాడని ప్రచారం చేశారు. కానీ, వారి ఆశలు నెరవలేదు. లగడపాటి సర్వే తుస్సుమంది.

ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లగడపాటి సర్వే తెలుగు దేశం పార్టీకి ఆశలు రేపుతోంది. ఏపీలో మరోసారి తెదేపా అధికారంలోకి రాబోతుందని లగడపాటి చెబుతున్నారు. అందుకు భిన్నంగా జాతీయసర్వేలన్నీ ఏపీలో వైకాపా దే అధికారం అంటున్నాయి. ఆదివారం సాయత్రం తిరుపతిలో లగడపాటి తన పూర్తి సర్వేను వెల్లడించనున్నారు. అంతకంటే ముందే శనివారం ప్రివ్యూ వదిలారు. సింగిల్ లైన్ లో తెలంగాణలో తెరాస అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది. ఏపీలో తెదేపాలో అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఇక లగడపాటి సర్వేలో ఎలాంటి సంచనాలు ఉండబోతున్నాయనేది రేపు తెలియనుంది.