హజీపూర్ హత్యలు : చెట్లపై వారి పేర్లు చెక్కాడు


యాదాద్రి-భువనగిరి జిల్లా హజీపూర్ గ్రామంలో వరుస అత్యాచారాలు, హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి గురించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆయన హత్యాచారం చేసి, హత్య చేసిన అమ్మాయిలు మనీషా, కల్పన, శ్రావణి పేర్లని ఓ చెట్టుపై చెక్కినట్టు గుర్తించారు. ఆ జట్టుకు శ్రీనివాస్ రెడ్ది పూజలు కూడా చేసేవారని చెబుతున్నారు.

సైకో శ్రీనివాస్ రెడ్డి ముందుగా అమ్మాయిని బంధించి ఊపిరి ఆడకుండా చేసేవాడు. హత్య చేసిన తర్వాత అత్యాచారం చేసేవాడని దర్యాప్తులో చెప్పినట్టు తెలుస్తోంది. ఇక, నిందితుడిని ఉరితీయాలని బాధిత కుటుంబాలు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు యాదాద్రిలో చేపట్టిన నివధిక నిరాహారదీక్షని శనివారం ఉదయం పోలీసులు భగ్నం చేశారు.

ఈ నేపథ్యంలో శనివారం బాధిత కుటుంబాలు కలెక్టర్ ను కలిశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని వారు కోరారు. బాధిత కుటుంబాలకు 50 లక్షల రూపాయలేసి నష్టపరిహారం చెల్లించాలని కూడా వారు డిమాండ్ చేశారు.
ఈ మేరకు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.