‘హీరో’ విజయ్ దేవరకొండ మొదలెట్టాడు


కొత్త దర్శకుడు ఆనంద్ అన్నమలై దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ద్విబాషా చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ
చిత్రానికి ‘హీరో’ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ ఉదయం ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకొంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు కొరటాల శివ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాళవిక హీరోయిన్ గా నటిస్తున్నారు. నోటా తర్వాత విజయ్ నటిస్తున్న చిత్రమిది.

ఇందులో విజయ్ బైక్ రేసర్ గా కనిపించబోతున్నాడు. తొలి షెడ్యూల్ ని ఢిల్లీలో ప్లాన్ చేశారు. తొలి షెడ్యూల్ లోనే బైక్ రేస్ సన్నివేశాలని చిత్రీకరించనున్నారు.ఇందుకోసం విదేశాల నుంచి బైక్ రేసర్లను, డ్రోన్ లను, ఆపరేటర్లను, స్కార్పియో ఎక్విప్ మెంట్ ను తెప్పిస్తున్నారు.
కేవలం రైస్ ట్రాక్ మీద షూటింగ్ పర్మిషన్ కే కోటికి పైగా చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీమూవీస్ నిర్మిస్తోంది.

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ నటించిన ‘డియర్ కామ్రెడ్’ జులై 26న దక్షిణాదిన అన్నీ బాషల్లో విడుదల కాబోతుంది. టీజర్ తో విడుదల కాబోతున్న అన్నీ బాషల్లోనూ అంచనాలు పెరిగిపోయాయ్.