పవన్ గెలుపు ఖాయం.. ఎక్కడి నుంచి అంటే ?


ఆదివారంతో సార్వత్రిక సమరం ముగిసింది. ఫలితాల కౌటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ముందస్తు సర్వేలు క్యూ కట్టాయి. కేంద్రంలో మరోసారి ఎన్డీయేదే అధికారమంటూ హింట్ ఇచ్చాయి. దాదాపు అన్నీ ఛానెల్స్, సర్వే సంస్థలది ఇదే మాట. మరోవైపు, ఏ మాత్రం అవకాశం ఉన్న కాంగ్రెస్ తో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తృతీయ కూటమి భావిస్తోంది.

ఇక, తెలుగు రాష్ట్రం ఏపీ విషయానికొస్తే.. అత్యధిక ఎంపీ స్థానాలని వైకాపా గెలుచుకోబోతుంది. ఆ పార్టీకి 18 నుంచి 20 ఎంపీ స్థానాలు రావొచ్చని సర్వేలు చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోలోనూ వైకాపాదే హవా. ఆ పార్టీయే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని జాతీయ సర్వేలు చెబుతున్నాయి. మాజీ ఎంపీ లగడపాటి మాత్రం ఏపీలో మళ్లీ తేదేపా అధికారం అంటున్నారు.

తెదేపా వందకుపైగా స్థానాల్లో విజయం సాధించబోతుంది. ఆ పార్టీకి మహిళా ఓటర్ల మద్దతు పుష్కలంగా లభించిందని చెబుతున్నారు. జనసేన ఎఫెక్ట్ రెండు పార్టీలపైనా పడింది. ఆ పార్టీ పదిలోపు స్థానాలనే గెలుచుకోనుంది జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపు ఖాయ అంటున్నారు లగడపాటి. ఐతే, పవన్ ఏ స్థానం నుంచి గెలుస్తారనేది మాత్రం చెప్పలేదు.

పవన్ భీమవరం, గాజువాక స్థానాలని నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఐతే, భీమవరం నుంచి పవన్ గెలుపు కష్టం. గాజువాక లోనే పవన్ కు గెలుపు అవకాశాలు ఎక్కువనే ప్రచారం జరుగుతోంది. కొందరు మాత్రం పవన్ భీమవరంలో గెలువబోతున్నాడని చెబుతున్నారు. మొత్తానికి పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడు. కానీ, ఎక్కడ నుంచి గెలుస్తాడనే స్పష్టంగా చెప్పలేం అంటున్నారు.