కౌంటింగ్’పై ఏపీ హైకోర్టులో పిటిషన్

ఎన్నికల కౌంటింగ్’పై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈవీఎంల కంటే ముందే వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో అత్యవసరంగా ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్ పై మరికొద్ది సేపట్లో వాదనలు జరగనున్నాయి. ఈవీఎంల చివరి రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక అయిదు వీవీప్యాట్‌ల స్లిప్పులను లెక్కించడానికి బదులు ప్రారంభంలోనే స్లిప్పులను లెక్కించేలా ఆదేశించాలని పిటీషనర్‌ వ్యాజ్యంలో కోరారు.

వీవీప్యాట్‌ స్లిప్పులు, ఈవీఎంల మధ్య ఓట్ల సంఖ్యలో తేడా వచ్చిన సందర్భంలో ఆయా అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని అన్ని వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. న్యాయవాది బాలాజీ యలమంజుల ఈ పిటిషన్ దాఖలు చేశారు. పీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.