కాజల్ కాలెత్తి తన్నింది.. !

హీరోయిన్ కాజల్ యాక్షన్ లోకి దిగింది. రౌడీలని రెచ్చిగొట్టి.. మరీ కాలెత్తి తన్నింది. తేజ దర్శకత్వంలో ఆమె నటించిన చిత్రం ‘సీత’. బెల్లకొండ శ్రీనివాస్ కథానాయకుడు. బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ వారమే (మే 24) సీత ప్రేక్షక్ల ముందుకు రానుంది. తాజాగా ‘సీత’ యాక్షన్ ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో కాజల్ కూడా యాక్షన్ లోకి దిగడం ఆకట్టుకుంటోంది. రౌడీలని కాలెత్తి తన్నింది. ట్రైలర్ లో ఈ సీన్ హైలైట్ గా నిలిచిది.

టీజర్, మొదటి ట్రైలర్ లో ‘సీత’ రొమాంటిక్ అనిపించింది. ఈ తరం అమ్మాయి అనిపించింది. ఐతే, యాక్షన్ ట్రైలర్ లో సీతలో మరో షేడ్ చూపించారు. కథానాయకుడు బెల్లకొండ శ్రీనివాస్ కూడా యాక్షన్ ట్రైలర్ లో కొత్తగా కనిపించాడు. సీతని కాపాడుకోవడం నా బాధ్యత అంటూ.. ఆమె కోసం యాక్షన్ లోకి దిగడం చూడొచ్చు. మొత్తంగా.. ‘సీత’ రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ లా కనిపిస్తోంది.